News
200 రూపాయల నోటు వచ్చేస్తోంది..
కరెన్సీ నోట్ల విషయంలో ప్రయోగాలు కొనసాగుతున్నాయి. మారకంలోని ఐదువందల, వెయ్యి నోట్లను కొన్ని నెలల కిందట రద్దు చేసిన మోడీ ప్రభుత్వం వాటి స్థానంలో రెండు వేల, ఐదు వందల రూపాయల నోట్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు రెండు వందల రూపాయల నోట్లను తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. రెండు వందల రూపాయల నోటుతో దినసరి ఆర్థిక కార్యకలాపాలు సౌలభ్యంగా ఉంటాయని ఆర్బీఐ చెబుతోంది. మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో ఉన్న ఆర్బీఐ ముద్రణాలయంలో ఇప్పటికే రెండు వందల రూపాయల నోట్ల ముద్రణ మొదలైనట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ నోట్లు మారకంలోకి రానున్నాయని సమాచారం. ఈ నోట్లను తీసుకొచ్చేందుకు ఆర్బీఐ పాలకమండలి ఇది వరకే ఆమోద ముద్ర వేసింది. ఈ నోట్లను అధునాతన సాంకేతికతతో రూపొందిస్తున్నారని, నకిలీలు తయారు చేయడానికి ఆస్కారం ఇవ్వకుండా రూపొందిస్తున్నారని సమాచారం.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








